![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -350 లో... శ్రీవల్లి టీచర్ గా జాయిన్ అయి క్లాస్ కి వెళ్తుంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే శ్రీవల్లికి ఏం చేయాలో అర్థం కాదు.. ఏం చెప్పాలో తెలియక చిన్న రైమ్ చెప్తుంది. అది విన్న స్టూడెంట్స్.. మేడమ్ అది మేమ్ నర్సరీ లోనీ నేర్చుకున్నామని అంటారు. ఇంత తొందర ఏంట్రా అని వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి శ్రీవల్లి కళ్ళు తిరిగిపడిపోతుంది. తీరా కళ్ళుతిరిగి చూసేసరికి భాగ్యం, ఆనందరావుల దగ్గర ఉంటుంది. అమ్మడు నీకు జాబ్ వచ్చింది కదా నాకు సాలరీలో కొంచెం డబ్బులు ఇవ్వమని భాగ్యం అంటుంది. దాంతో వాళ్ళని కొట్టడానికి వాళ్ళ వెనకాల పరిగెడుతుంది.
అప్పుడే విశ్వ వచ్చి.. ఆ ధీరజ్ గాడు నన్ను అమూల్యని చూసాడనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. నేనొక ప్లాన్ చెప్తాను నువ్వు మీ చెల్లి ప్రేమ దగ్గరికి వెళ్ళు అని భాగ్యం ఏదో చెప్పేలోపే ప్రేమ దగ్గరికి విశ్వ బయల్దేరతాడు. ప్రేమ నీతో మాట్లాడాలని పక్కకి తీసుకొని వెళ్తాడు. అమూల్య నన్ను ఇష్టపడుతుంది. మన కుటుంబాల గురించి నీకు తెలియదని నచ్చజెప్పుతున్న కానీ తను వినట్లేదు కనీసం నువ్వు అయిన చెప్పు ప్రేమ అని విశ్వ అంటాడు.
అప్పుడే ధీరజ్ వచ్చి నా చెల్లిని ట్రాప్ చేసావంటూ విశ్వని కొడతాడు. ఒరేయ్ ధీరజ్ ఆగమని ధీరజ్ ని ప్రేమ కొడుతుంది. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ కొడతాడు. అదంతా తెలిసి భాగ్యం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ప్రేమ జంట మధ్య గొడవ మొదలయింది. ఇక నెక్స్ట్ ఆ నర్మద.....ఇక సీన్ కట్ చేస్తే నర్మదకి అమూల్య, విశ్వ కనపడాలని భాగ్యం ఉహించుకొని చెప్తుంది. నర్మదకి అమూల్య, విశ్వ కన్పిస్తారు అది చూసి సాగర్ కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి త్వరగా రమ్మని సాగర్ కీ ఫోన్ లో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |